తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భూకబ్జాలకు నిరసనగా జాతీయ రహదారిపై ఆందోళన

నకిలీ పట్టాలు సృష్టించి.. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిలకుంట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి కలెక్టర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

siddulakunta-villagers-protest-on-land-mafia-at-nirmal-collectorate
భూకబ్జాలపై గ్రామస్థుల ఆందోళన... జాతీయ రహదారిపై బైఠాయింపు

By

Published : Dec 16, 2020, 4:49 PM IST

అక్రమంగా పట్టాలు సృష్టించి.. భూకబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సిద్దిలకుంట గ్రామస్థులు.. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి.. కలెక్టర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తమ సమస్యకు పరిష్కారం చూపే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వారు వినిపించుకోలేదు. భూకబ్జాలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ జలాశయంలో తమ భూములు కోల్పోగా.. పునరావాసం కింద ఈ గ్రామంలో భూములు వచ్చాయని... ఇక్కడకు వస్తే భూకబ్జాదారులు నకిలీ పట్టాలు సృష్టించి కబ్జాలు చేస్తున్నారని వాపోయారు.

ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి భూమిని గ్రామానికి అప్పగించాలని కోరారు. రెండు వారాలలో సమస్యకు పరిష్కారం చూపుతామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమింపజేశారు.

ఇదీ చూడండి:శివారుపై కన్ను... భాగ్యనగరంలో భూ బకాసురులు

ABOUT THE AUTHOR

...view details