తలపై బండరాయితో మోది ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన గొల్ల రాములు(50) గొర్రెల కాపరి. రోజులాగే మంగళవారం కూడా గొర్రెలను మేపడానికి వెళ్లాడు. రాత్రైనా రాములు ఇంటికి తిరిగిరాలేదు. బుధవారం ఉదయం వట్టెం గ్రామ శివారు కల్వకుంట తాండ గేటు వద్ద రాములు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు.
గొర్రెల కాపరి దారుణ హత్య.. అంతుచిక్కని కారణం
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలోని ఓ గొర్రెల కాపరి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో కొట్టి హతమార్చారు. హత్యజరిగిన ప్రాంతంలో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. తెలిసిన వారే మందు తాపించి హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
బిజినపల్లి మండలంలో దారుణం.. గొర్రెల కాపరి దారుణ హత్య
హత్య జరిగిన ప్రదేశంలో మద్యం సీసాలు, నీళ్ల బాటిళ్లను పోలీసులు గుర్తించారు. తెలిసిన వ్యక్తులే మద్యం తాగించి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన ప్రదేశంలో డాగ్ స్క్వాడ్ టీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
మృతదేహాన్ని పంచనామా కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని సీఐ గాంధీ నాయక్ తెలిపారు.