నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని బండర్పల్లి వాగునుంచి అక్రమంగా కొనసాగుతున్న ఇసుక దందాను రెవెన్యూ అధికారులు గుట్టరట్టు చేశారు. పూసలపాడు, రాకొండ గ్రామాలకు చెందిన ఇసుక మాఫియా.. పరిసర పంటపొలాల్లో అక్రమంగా నిల్వలు ఉంచారు.
ఇసుక అక్రమ నిల్వ.. రెవెన్యూ అధికారుల స్వాధీనం - నారాయణపేట జిల్లాలో ఇసుక స్వాధీనం
అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంగా ఇసుక నిల్వలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చోటు చేసుకుంది. పూసలపాడు, రాకొండ గ్రామాలకు చెందిన ఇసుక మాఫియా.. పరిసర పంటపొలాల్లో అక్రమంగా నిల్వలు ఉంచినట్లు గుర్తించారు.
ఇసుక అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
ఇసుక నిల్వలపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఇసుక నిల్వలు ఉన్న ప్రాంతాలను గుర్తించి సుమారు 155 ట్రాక్టర్ల విలువైన ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఎవరు నిల్వ చేశారనే విషయమై ఆయా గ్రామాలలో విచారణ చేపట్టారు. గుట్టు చప్పడు కాకుండా ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.