సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం ప్రాథమిక పాఠశాలలో దొంగలు పడ్డారు. పాఠశాలలోని రూ.10వేల విలువ గల ఎల్ఈడీ టీవీ, స్టెబిలైజర్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. కరోనా వైరస్ వల్ల పాఠశాలలు అన్ని మూతపడే ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన దొంగలు... టీవీ ఉన్న గది తాళం పగులగొట్టి ఎల్ఈడీ టీవీ, స్టెబిలైజర్‌ను ఎత్తుకెళ్లారు.
పాఠశాలలో దొంగలు... ఎల్ఈడీ టీవీ, స్టెబిలైజర్ చోరీ
వేసిన తాళం వేసినట్లే ఉంది. ఇన్ని రోజులు మూతపడి ఉంది కదా... తుప్పు పట్టిందనుకున్నారు. తీరా పగులగొట్టి చూస్తే... అప్పుడర్థమైంది. పాఠశాలలు మూసి ఉండటాన్ని దొంగలు సద్వినియోగం చేసుకుని గుల్ల చేశారని...!
పాఠశాలలో దొంగలు... ఎల్ఈడీ టీవీ, స్టెబిలైజర్ చోరీ
మళ్లీ ఎప్పటిలా తెలియకుండా గదికి తాళం వేసి వెళ్లారు. కాగా... ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 28న ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు. గది తాళం కొత్తది కావడం... ఎంతకీ రాకపోవటం వల్ల అనుమానంతో తాళం పగులగొట్టి లోపల పరిశీలించగా... దొంగలు పడినట్లు గుర్తించారు. ఉపాధ్యాయులు విషయాన్ని వెంటనే మిరుదొడ్డి పోలీసులకు తెలియజేయగా... పాఠశాలను పరిశీలించి కేసు నమోదు చేశారు.