తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

హుండీ పగలగొట్టి.. అమ్మవారి గుడిలో చోరీ

ఎస్సాఆర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని శ్రీ చిత్తారమ్మ పెద్దమ్మ దేవాలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో దొంగతనానికి యత్నించారు. స్థానికులు అప్రమత్తం కావడంతో కొంత నగదు తీసుకుని పారిపోయారు.

robbery in temple, sri chittaramma peddamma temple, borabanda
ఆలంయంలో చోరీ, శ్రీ చిత్తారమ్మ పెద్దమ్మ దేవాలయం, బోరబండ

By

Published : Jan 11, 2021, 12:40 PM IST

Updated : Jan 11, 2021, 1:02 PM IST

హైదరాబాద్​లోని బోరబండ సైట్​ 3 లో ఉన్న శ్రీ చిత్తారమ్మ పెద్దమ్మ దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఆలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టి నగదు దోచుకెళ్లడానికి యత్నించారు. స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో కొంత నగదు తీసుకుని పారిపోయారు.

ప్రతిరోజు లాగే ఆదివారం ఉదయం అమ్మవారి గుడికి పూజలు నిర్వహించడానికి వెళ్లాను. తలుపులు తెరిచి చూడగా ఆలయ ప్రాంగణంలో హుండీ పడిపోయి నగదు కొంత బయటికి రావడం కనిపించింది. ఈ ఘటనపై దేవాలయ కమిటీ సభ్యులకు తెలియపరిచాను.

తిరుమల శర్మ, ఆలయ అర్చకులు

ఈ సంఘటనపై దేవాలయ కమిటీ సభ్యులు.. ఎస్సార్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:విద్యుత్ టవర్​కు ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

Last Updated : Jan 11, 2021, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details