సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలో రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్ల చుట్టూ గడ్డి తొలగిస్తున్న ఉపాధి హామీ కూలీలపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కూకునూర్పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి - రాజీవ్ రహదారిపై ఘరో రోడ్డు ప్రమాదం
సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి
పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... కూలీలు రాజీవ్ రహదారిపై ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తామన్న మంత్రి హరీశ్ రావు హామీతో ఆందోళన విరమించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఎస్సై సాయిరామ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు