ఏపీలోని కర్నూలు జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నలుగురు చిన్నారులు మృతి చెందారు. మత ప్రచారంలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున సుమారు 40 మంది ప్రార్థన చేస్తూ.. యర్రగుంట్ల నుంచి నడిచి వెళ్తుండగా డీసీఎం లారీ వారిపైకి దూసుకెళ్లింది.
ఘోర ప్రమాదం: లారీ ఢీకొని నలుగురు చిన్నారులు మృతి - Kurnool crime news
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రార్థనా మందిరానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ప్రజలపైకి డీసీఎం వ్యాన్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
road accident in Kurnool district
ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణమైన డీసీఎంను డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో స్థానికులు వెంటపడి బత్తులూరు వద్ద పట్టుకున్నారు. క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- ఇదీ చూడండి :కరోనా వేళ దేశంలో పెరిగిన గృహహింస