నల్గొండ జిల్లా అనుముల మండలం ఈశ్వర్‌నగర్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులిద్దరిని పెద్దవూర మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన కుంటి గొర్ల శ్రవణ్(27) నవీన్(18)గా గుర్తించారు.
ఈశ్వర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - నల్గొండ జిల్లా లేటెస్ట్ వార్తలు
గుర్తుతెలియని వాహనం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నల్గొండ జిల్లా అనుముల మండలం ఈశ్వర్‌నగర్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఈశ్వర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..
వీరు శ్రవణ్ వాళ్ల అక్క కూతురు వివాహానికి హాలియా నుంచి బంగారు ఆభరణాలు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. శ్రవణ్‌కు ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: విషాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి