జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన పత్తి వీరస్వామి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచుతారు. హోటళ్లకు, మెస్లకు అధిక ధరలకు విక్రయిస్తారు. ముందస్తు సమాచారంతో రఘునాథపల్లి సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి పత్తి వీరస్వామి ఇంటిపై దాడులు నిర్వహించారు. 194 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం.. పట్టుకున్న పోలీసులు - ration rice latest news
పేద ప్రజలకు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసులు పట్టుకున్నారు. బియ్యంతో పాటు లక్ష 20 వేల నగదు సీజ్ చేశారు.
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం.. పట్టుకున్న పోలీసులు
అనంతరం మండలంలోని వేల్ది, అశ్వరావుపల్లి గ్రామాల్లో కూడా సుమారు 500 క్వింటాల బియ్యం నిల్వలను గుర్తించినట్లు సీఐ పేర్కొన్నారు. బియ్యంతోపాటు లక్ష 20 వేల నగదును స్వాధీనం సీజ్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్న పోలీసులు.. ఇద్దరిపై కేసు