నిర్మల్ జిల్లా కేంద్రంలోని ముక్టాపూర్ గ్రామంలో ఓ మైనర్‌పై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ మానవ మృగం. గ్రామంలోబుధవారంనాటిక ప్రదర్శించారు. ప్రదర్శన చూడటానికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు రాంచందర్ అనే వ్యక్తి. భయపడిన బాలిక కేకలు వేస్తూ కుటుంబసభ్యుల వద్దకు పరుగులు తీసింది. గ్రామస్థులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు రాంచందర్‌ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
మైనర్‌పై అత్యాచారం: దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ముక్టాపూర్ గ్రామస్థులు.
పదకొండు సంవత్సరాల బాలికపై అత్యాచారం
TAGGED:
rape attempt on minor