తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నకిలీ ఫేస్​బుక్​ ఖాతాలతో చాటింగ్​.. ఆ తర్వాత...

నకిలీ ఫేస్​బుక్​ ఖాతాలు సృష్టించి మహిళలను వేధిస్తోన్న వ్యక్తి రాచకొండ సైబర్​ క్రైం పోలీసులకు చిక్కాడు. రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ చెందిన ఓ యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్​ క్రైం బృందాలు నిందితుడిని అరెస్ట్​ చేశాయి.

cyber crimes
నకిలీ ఫేస్​బుక్​ ఖాతాలతో చాటింగ్​.. ఆ తర్వాత...

By

Published : Dec 17, 2020, 10:30 PM IST

నకిలీ ఫేస్​బుక్‌ ఖాతాలు సృష్టించి యువతులను మోసం చేస్తున్న సైబర్‌ నేరగాడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ బృందావన్‌ కాలనీకి చెందిన వరకాల రమేశ్​.. పద్మావతి పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. యువతులు, మహిళల సమాచారం సేకరించి వారిని మోసం చేద్దామని భావించాడు. మహిళలతో స్నేహం చేసేందుకు వారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించే వాడు. ఈ క్రమంలో ఓ యువతి అతని రిక్వెస్ట్‌కు స్పందించి.. మహిళగా భావించి చాటింగ్‌ చేయడం ప్రారంభించింది.

ఇదే అదనుగా రమేశ్​ ఆమె వ్యక్తిగత ఫోన్ నంబర్​ను సేకరించాడు. ఫోన్​ చేసి తరచూ బెదిరింపులకు పాల్పడేవాడు. సదరు యువతి అతని నంబర్​ను బ్లాక్‌ చేసింది. అతను వేరే నంబర్ల నుంచి ఫోన్‌ చేసి వేధించడం మొదలు పెట్టాడు. మారు ఫోటోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఆందోళన గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు ప్రారంభించిన సైబర్‌ క్రైం బృందం.. రమేశ్​ను అరెస్ట్​ చేసింది.

ఇవీచూడండి:వివాహితతో గొడవపడ్డాడు... మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు

ABOUT THE AUTHOR

...view details