తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి - వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

బిడ్డను ప్రసవించిన కొంతసేపటికే బాలింత మృతి చెందిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాకేంద్రంలో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపించారు.

వైద్యులు నిర్లక్ష్యంతో బాలింత మృతి
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

By

Published : Sep 13, 2020, 7:05 PM IST

Updated : Sep 13, 2020, 9:38 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం జరిగింది. బిడ్డను ప్రసవించిన కొద్దిసేపటికే బాలింత మృతి చెందింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవం కోసం చిర్రకుంటకు చెందిన కె.ప్రభాకర్ తన భార్యను చేర్పించాడు. శనివారం సాయంత్రం 6గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్పించగా... రాత్రి 11.45కు ఆపరేషన్​ చేసి బిడ్డను తీశారు.

కొంతసేపటికి బాలింతకు రక్తస్రావం కావడం గుర్తించిన వైద్యులు ఆమెను మంచిర్యాలలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని ఆసిఫాబాద్​ తీసుకొచ్చేసరికే వైద్యులు ఆస్పత్రికి తాళాలు వేసి పరారయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:ట్రాక్టర్​ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి

Last Updated : Sep 13, 2020, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details