తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మృత్యువుతో పోరాడి... చిన్నారి మృతి - kamineni

నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన చిన్నారి ప్రణతి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. ఈ నెల 9న యాదాద్రిలో రాచకొండ పోలీసు రక్షక్ వాహనం ఢీ కొట్టటం వల్ల గాయపడి చికిత్స పొందుతోంది.

చిన్నారి మృతి

By

Published : May 12, 2019, 2:28 PM IST

Updated : May 12, 2019, 2:39 PM IST

యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి దర్శనానికి వచ్చి ప్రమాదానికి గురై ఎల్బీనగర్​ కామినేనిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందింది. ఈ నెల 9న హైదరాబాద్ చైతన్యపురికి చెందిన ప్రణతి కుటుంబసభ్యులు పాతగుట్టలో దర్శనం అనంతరం... చలువ పందిళ్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో విధుల్లో భాగంగా రాచకొండ పోలీసులు అక్కడికి వచ్చారు. రక్షక్ వాహనాన్ని నిలిపే క్రమంలో వెనక ఉన్న చిన్నారి ప్రణతికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం వెంటనే ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు.

నాలుగు రోజులుగా చికిత్స పొందుతన్న ప్రణతికి గుండె పనిచేయడం లేదంటూ వైద్యులు తండ్రికి చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు మృతి చెందింది. పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని చైతన్యపురిలోని ఇంటికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రణతి తండ్రి మల్లేష్ విలపించిన తీరు స్థానికులను కలచివేసింది.

చిన్నారి మృతి

ఇవీ చూడండి: పోలీస్​ వాహనం ఢీ కొని గాయపడిన చిన్నారి ప్రణతి మృతి

Last Updated : May 12, 2019, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details