నిషేధిత గుడుంబా తయారీ చేయొద్దని ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారడం లేదని పోలీసులు తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను పోలీసులు పట్టుకున్నారు.
వర్ధన్నపేటలో 300కిలోల నల్లబెల్లం పట్టివేత - తెలంగాణ నేర వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట వద్ద కారులో తరలిస్తున్న నల్లబెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టణ శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా.. 300కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.
వర్ధన్నపేటలో 300కిలోల నల్లబెల్లం పట్టివేత
వర్ధన్నపేట శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో 300 కిలోల నల్లబెల్లం, 60కిలోల పటికలను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి:పశువులను మేపేందుకు వెళ్లి...విద్యాదాఘాతానికి బాలుడు బలి