డ్రగ్స్ విక్రయిస్తున్న ఆశిష్ కుమార్ అనే వ్యక్తిని గోపాలపురం పోలీసులు, ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 60 వేల విలువైన 12 గ్రాముల నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.
డెలివరీ బాయ్ టూ డ్రగ్స్ డెలివరీ - hyderabad news
అతడు ముంబై మహానగరంలో డెలివరీ బాయ్‌గా చేరాడు. కొన్ని రోజులు బాగానే పని చేసినప్పటికీ .. సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. పబ్‌లో పరిచయమైన వ్యక్తి మాటలను నమ్మి డ్రగ్స్ సరఫరా వల్ల అధికంగా సంపాదించాలనే అత్యాశను పెంచుకున్నాడు. చివరకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
గతంలో ఆశిష్ కుమార్ డెలివరీ బాయ్‌గా చేరాడు. త్వరగా అధికంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో జామా సాబ్రీ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అతడి ద్వరా డ్రగ్స్ విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు.
పక్కా ప్రణాళికతో..
ఆశిష్ కుమార్, సాబ్రీ ఇద్దరూ కలిసి ముంబై నగరం నుంచి హైదరాబాద్‌లో ఉన్న పలు పబ్‌లు, క్లబ్‌లకు డ్రగ్స్ సరఫరా చేసే వారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సికింద్రాబాద్‌లోని ఎస్.డి రోడ్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఆశిష్ కుమార్‌ని పోలీసులు అరెస్టు చేశారు. సాబ్రీ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.