నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామం వద్ద రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి ఆంధ్రకు తరలిస్తున్న ఓ లారీని గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని సేకరించి నూకలుగా మార్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలగడప వద్ద 215 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేశారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - pds rice
నల్గొండ జిల్లా ఆలగడపలో రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
బియ్యాన్ని తరలిస్తున్న వెంకటరమణ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో సైతం ఇలాంటి కేసుల్లో ఉన్నాడని, తదుపరి విచారణ అనంతరం అతనిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.