సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నలుగురు నిందితులతో పాటు మరో ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితుల సంఖ్య 21కి పెరిగింది. ఈ కేసులో ఇప్పటికే 14మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... పరారీలో ఉన్న ఎ5 కృష్ణ, ఎ6 బాషా, ఎ17 జగన్, ఎ18 సయ్యద్‌లను పట్టుకున్నారు.
పరువు హత్య: పరారీలో ఉన్న కీలక నిందితుల అరెస్ట్ - హేమంత్ హత్య కేసు వార్తలు
హేమంత్ హత్య కేసులో పరారీలో ఉన్న కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నలుగురు నిందితులతో పాటు మరో ముగ్గురిని విచారిస్తున్నారు. వీరి అరెస్టుతో ఈ కేసులో నిందితుల సంఖ్య 21కి పెరిగింది.
HEMANTH MURDER
వీరితో పాటు హేమంత్ భార్య అవంతి సోదరుడు అశీష్ రెడ్డి, సందీప్‌తో పాటు మరో వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఎ5 కృష్ణ... ఎ1 యుగంధర్ రెడ్డితో కలిసి హత్యకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం నిందితులకు జగన్, సయ్యద్‌లు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.
ఇదీ చదవండి :హేమంత్ హత్య కేసులో మలుపు.. తెరపైకి అవంతి సోదరుడు!