బాధితులకు ఫోన్లు చేసి వారి ఖాతాల్లోంచి నగదు బదిలీ చేసుకుంటున్న సైబర్ నేరస్థులు వెంటనే వారి ఫోన్ల సిమ్‌కార్డులను చరవాణుల్లోంచి తీసేస్తున్నారు. సిమ్‌కార్డు నెట్‌వర్క్ నుంచి కాల్‌డేటా తీసుకున్నా... అవికూడా బాధితుల నంబర్లే ఉంటున్నాయి. దీంతో పోలీసులు కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వీరిని పట్టుకుంటున్నారు.
- బాధితుడిని మోసం చేసిన ఫోన్ నంబర్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ కంపెనీల సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. ఐదు నిముషాల్లోపు ఆ సిమ్‌కార్డు తీసుకున్న వ్యక్తి పేరు, వివరాలు వస్తాయి.
- సిమ్‌కార్డు తీసుకున్న వ్యక్తి పేరు.. వివరాలతో సైబర్ నేరస్థుడికి ఏదైనా సంబంధం ఉందా అని తెలుసుకునేందుకు మరో సాఫ్ట్‌వేర్‌కు ఈ వివరాలను పంపుతారు. ఆ సిమ్‌కార్డుతో ఎక్కువసార్లు మాట్లాడిన ఫోన్ నంబర్లు కనిపిస్తాయి.
- సైబర్ నేరస్థులు పదుల సంఖ్యలో సిమ్‌కార్డులు వినియోగించినా... ఫోన్ చేసేందుకు ఒకటి లేదా రెండు ఫోన్లు మాత్రమే వినియోగిస్తారు. సిమ్‌ల ద్వారా ఆ సిమ్‌కార్డులు ఏఏ ఫోన్ల ద్వారా వచ్చాయన్నది తెలుసుకుంటారు.
- బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు, సిమ్‌కార్డుల ద్వారా ఫోన్ల వివరాలను తెలుసుకోగానే... నేరస్థులెవరన్నది తెలిసిపోతుంది. ఏటీఎం విత్‌డ్రాల ఆధారంగా, ఫోన్ల వివరాలతో నేరస్థుల అసలు చిరునామాలను గుర్తిస్తున్నారు.