తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఘరానా నేరస్థుడు : చేతివాటం చూపించి పోలీసులకు చిక్కాడు - theft in Hyderabad

వరుస నేరాలకు పాల్పడుతూ జైలుకు వెళ్లొచ్చాడు. హైదరాబాద్​లో అత్తారింటికి వచ్చిన ఈ ఘరానా నేరస్థుడు.. చేతి ఖర్చుల కోసం చేతివాటం చూపించి పోలీసులకు చిక్కాడు.

person stole money from chicken center in Hyderabad caught by lb. nagger police
చేతివాటం చూపించి పోలీసులకు చిక్కాడు

By

Published : Dec 21, 2020, 2:29 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా‌లో వరుస నేరాలకు పాల్పడుతూ జైలుకు వెళ్లొచ్చిన నిందితుడు ఇటీవల హైదరాబాద్‌లోని అత్తారింటికి వచ్చి చేతిఖర్చుల కోసం ఓ పాన్‌షాపు, మరో చికెన్‌ దుకాణంలో చోరీకి పాల్పడి ఎల్బీనగర్‌ పోలీసులకు చిక్కాడు.

సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌కు చెందిన గిడ్డూ సింగ్‌ అలియాస్‌ గోవింద్‌సింగ్‌(35) స్థానికంగా నేరాలకు పాల్పడి 21సార్లు అరెస్టయ్యాడు. 2 హత్యకేసులు, అత్యాచారం కేసు, గుడుంబా అక్రమ రవాణాకేసు, ఇళ్లలో చోరీ కేసులున్నాయి. ఈ జనవరిలో జైలుకెళ్లి ఫిబ్రవరిలో విడుదలైన గిడ్డూసింగ్‌... ఇటీవల నగరంలోని రాజీవ్‌గాంధీనగర్‌లో ఉండే అత్తారింటికి వచ్చాడు. చేతి ఖర్చుల కోసం ఎల్బీనగర్‌లోని బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ పాన్‌దుకాణంలో చోరీ చేయడంతోపాటు మన్సూరాబాద్‌ సాయినగర్‌లోని చికెన్‌ దుకాణంలో గల్లా పెట్టెనూ కొల్లగొట్టాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఎల్బీనగర్‌ పోలీసులు నిందితుణ్ని శనివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details