సోయా నూర్పిడి చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు యంత్రంలో పడి పోయి ప్రాణాలొదిలిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టిలో జరిగింది. ఉపాధి నిమిత్తం తెచ్చుకున్న పంట నూర్పిడి యంత్రం అతని పాలిట మృత్యువైంది.
విషాదం: హార్వెస్టర్లో పడి యువకుడి మృతి - sangareddy kangti person died with harvester
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం తెచ్చుకున్న హార్వెస్టర్ (నూర్పిడి) యంత్రం అతని పాలిట శాపమైంది. యువకుడి ప్రాణాలను బలిగొంది. సోయా పైరును నూర్పిడి చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు యంత్రంలో పడిపోయి విగతజీవిగా మారాడు.
కంగ్టి మండల కేంద్రానికి చెందిన బాలాజీ అనే యువకుడు నూర్పిడి యంత్రంతో ఉపాధి పొందేవాడు. పెసర, కంది, సోయా, జొన్న తదితర పంటలను నూర్పిడి చేస్తూండేవాడు. ఇటీవల నూతనంగా నూర్పిడి యంత్రం తెచ్చుకున్నాడు. యంత్రాన్ని ట్రాక్టర్కు అనుసంధానం చేసి రైతుల పొలాల వద్దకు వెళ్లి పంట నూర్పిడి చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం కంగ్టిలో సోయా నూర్పిడి చేస్తుండగా.. యంత్రంపై నిలబడి పైరు అందిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు యంత్రంలో పడి పోయాడు. గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ యంత్రం నిలిపివేశాడు. అప్పటికే యువకుడు ప్రాణాలు వదిలాడు.
ఇదీ చూడండి:ఏసీపీ నర్సింహారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ
TAGGED:
sangareddy latest