మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ సేష్టన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హైదరాబాద్ ఫతేనగర్‌కు చెందిన బండారి నవీన్( 33) జీడిమెట్లలో దుకాణం నిర్వహిస్తున్నాడు. మూడు రోజులుగా అనారోగ్యం కారణంగా వాంతులు, విరోచనాలు కావడం వల్ల స్థానిక ఆసుపత్రిలో చికిత్స పోందాడు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - death in a suspicious condition latest news
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
suspect death in medchal district latest news
ఆరోగ్యం బాగా లేదు కనుక ఇంట్లోనే ఉండాలని సూచించిన వినకుండా మంగళవారం దుకాణం తీసేందుకు నవీన్ వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మధ్యాహ్నం దుకాణంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెళ్లి చూసే సరికి నవీన్ మృతి చెందాడు. వెంటనే వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.