వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్‌లో ఇసుక వ్యాపారుల నుంచి మధ్యవర్తుల ద్వారా పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్‌కు 15 రోజులకోసారి రూ.5 వేల చొప్పున.. నెలకు రూ.50 వేలు ఇవ్వాలని పరిగి ఎస్సై వెంకటేశ్వర్లు హుకూం జారీ చేశారని, డబ్బులు ఇవ్వకుంటే ట్రాక్టర్లను సీజ్ చేస్తానని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఆడియో జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆడియో కలకలం: 15 రోజులకోసారి రూ.5 వేలు ఇవ్వాలి - vikarabad district latest news
వికారాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. వ్యాపారులు ఇసుక కృత్రిమ కొరత సృష్టించి.. లక్షల రూపాయలు దండుకుంటున్నారు. వీరికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు.
ఆడియో కలకలం: 15 రోజులకోసారి రూ.5 వేలు ఇవ్వాలి
ఘటనపై డీఎస్పీని విచారణ కోరగా.. ఆడియో కలకలంపై స్పష్టత లేదని, విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.