ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రఘునాథపల్లికి చెందిన రామచంద్రయ్య రోజు వారిగా తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన రావడం వల్ల చెట్టు పై నుంచి కాలు జారీ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి
కల్లు గీతకార్మికులకు చెట్లే ఉపాధి. అలాంటి ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి
మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక్క కూతురు ఉన్నారు. వారు రోదించిన తీరు పలువురిని కలచివేసింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: తల యంత్రంలో ఇరుక్కుని కార్మికుడు మృతి