తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మల్లన్నసాగర్ నిర్వాసితుల వంటా వార్పు

మల్లన్నసాగర్ నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని కోరుతూ రహదారిపై వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. సర్వే పనులు ప్రారంభించడం వల్ల తండా వాసులు ఆందోళనకు దిగారు. పోలీసులు, సర్వే బృందం సంఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

By

Published : Dec 30, 2020, 12:48 PM IST

pallepahad-thanda-people-for-justice-of-mallanna-sagar-project-survey-in-siddipet-district
మల్లన్నసాగర్ నిర్వాసితుల వంట-వార్పు

లబ్ధిదారులందరికీ న్యాయం చేయాలని కోరుతూ మల్లన్న సాగర్ నిర్వాసితులు రహదారిపై వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం ముంపు ప్రభావిత ప్రాంతమైన పల్లెపహాడ్ తండాలో అధికారులు సోమవారం సర్వే పనులు ప్రారంభించారు. సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే సర్వే చేస్తుండటంతో తండా వాసులు ఆందోళన చేపట్టారు. ఏటిగడ్డ, కిష్టాపూర్​లో ఏ విధంగా సర్వే చేశారో అదే విధంగా సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ మల్లన్న సాగర్ నిర్మాణం కోసం మట్టిని తరలిస్తున్న వాహనాలను అడ్డగించారు.

పోలీసులు, సర్వే బృందం సంఘటనా స్థలానికి చేరుకొని నిర్వాసితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. పల్లెపాడు తండా నిర్వాసితులు ఆందోళన చేపట్టడంతో గ్రామస్థులు సిద్దిపేట కలెక్టర్ వెంకటరామారెడ్డిని కలిశారు. వారి సమస్యలను వివరించగా... అందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చదవండి:కొత్త రూల్​- చిన్న పిల్లలకు కేక్, ఐస్​క్రీమ్​ బంద్!

ABOUT THE AUTHOR

...view details