శిఖాకు క్లీన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది : పద్మశ్రీ - జయరాం
వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇవ్వడంపై... భార్య పద్మ శ్రీ అనుమానాలు వ్యక్తం చేశారు. రాకేశ్ రెడ్డి వద్ద తీసుకున్న డబ్బు ఏమైందో తనకు తెలియదన్నారు. తన భర్త చనిపోయిన తర్వాత శిఖా తమ ఇంటికి ఎందుకొచ్చిందో పోలీసులు విచారించాలని కోరారు. జయరాం భర్తగా, తండ్రిగా గొప్ప పాత్ర పోషించారని పద్మ శ్రీ గుర్తు చేసుకున్నారు.
జయరాం భార్య
శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని జయరాం భార్య పద్మశ్రీ అన్నారు. జనవరి 31న... రాత్రి 12 గంటల 30 నిమిషాలు ఫోన్ చేశారు. మళ్లీ 5 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పారని తెలిపారు.