నల్గొండ జిల్లా పీఏపల్లి తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే సహాయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేనావత్ శ్యామ్ నాయక్ రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ నల్గొండ ఇంఛార్జి డీఎస్పీ బి.కృష్ణగౌడ్ నేతృత్వంలో జరిగిన దాడుల్లో ఏఆర్‌ఐ శ్యామ్ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భీమనపల్లికి చెందిన యల్గూరి వెంకట్ రెడ్డి అదే గ్రామానికి చెందిన యమున వద్ద 4.37 ఎకరాల భూమి కొని 2019 సంవత్సరం జులై 9న తన భార్య సావిత్రి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకొని దస్త్రాలతో ఏఆర్‌ఐ శ్యామ్‌నాయక్‌ను ఆశ్రయించారు.
ఏసీబీ వలకి చిక్కిన పీఏ అసిస్టెంట్ రెవిన్యూ ఇన్స్పెక్టర్! - నల్గొండ జిల్లా వార్తలు
ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ జిల్లా పీఏపల్లి తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే సహాయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేనావత్ శ్యామ్ నాయక్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. నల్గొండ ఏసీబీ ఇంఛార్జి డీఎస్పీ బి.కృష్ణగౌడ్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి.
కొద్దిరోజులకు శ్యామ్ నాయక్ 4.37 ఎకరాల నుంచి 3.38 ఎకరాలకే పాసుపుస్తకం జారీ చేశాడు. మిగిలిన 39 గుంటల్లో 22 గుంటలను యమున గతంలోనే ఇతరులకు విక్రయించగా.. సావిత్రికి మరో 17 గుంటలు పాసు పుస్తకంలో అమలుకావాల్సి ఉంది. ఇందుకు రెండోసారి ఈ ఏడాది జనవరి 24న దరఖాస్తు చేసుకొని దస్త్రాలు ఏఆర్ఐకి శ్యామ్ నాయక్‌కు ఇచ్చారు. ఈ పని చేయడానికి శ్యామ్‌నాయక్ రూ.20 వేలు లంచం అడిగాడు. అంత ఇవ్వలేనని సదరు బాధితుడు రూ.10వేలకు ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం వెంకట్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వల పన్నారు. వెంకట్‌రెడ్డి నుంచి శ్యామ్‌నాయక్ రూ.10 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడని డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు వెంకట్‌రావు, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు లంచాల కోసం ఇబ్బందులకు గురిచేస్తే టోల్‌ఫ్రీ నంబరు 1064, డీఎస్పీ నంబరు 73826 25525కి ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. కాగా తన పని కోసం తహశీల్దార్‌ను అడిగితే ఏఆర్‌ఐ శ్యామ్‌ను సంప్రదించమని చెప్పారని, ఆయన పలుమార్లు తిప్పుకొని.. చివరకు రూ.20 వేలు లంచం అడిగాడని.. ఏం చేయాలో తోచక ఏసీబీని ఆశ్రయించానని వెంకట్‌రెడ్డి తెలిపారు. నాలుగేళ్ల కింద ఇదే కార్యాలయంలో శంకర్ అనే రైతు వద్ద వీఆర్వో సత్యనారాయణ రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి