ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహిస్తోన్న అహ్మద్ పాషా అనే వ్యక్తిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి రూ. 50 వేల నగదుతో పాటు ఒక చరవాణి స్వాధీనం చేసుకున్నారు. జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని సాయిబాబా నగర్‌కు చెందిన వ్యక్తి తన నివాసంలో ఆన్‌లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.
ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహణ... అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటీ - ఆన్‌లైన్ మట్కా నిర్వాహకుడి అరెస్టు
సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఆన్‌లైన్‌లో జూదం నిర్వహిస్తోన్న వ్యక్తి మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసుల చేతికి చిక్కాడు. అతని వద్ద నుంచి 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహణ... అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటీ
సులభంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో పాషా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జవహార్ నగర్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: కానిస్టేబుల్ మందలించాడని వ్యక్తి ఆత్మహత్య