తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆమె ఇంటిముందు మృతదేహం.. చనిపోయాడా, చంపేశారా? - హైదరాబాద్​ నేర వార్తలు

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్ని ఎన్నివిధాలుగా చెప్పినా కొందరి తలకెక్కడం లేదు. ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించడం వల్ల మృతి చెందిన ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా సురారంలో జరిగింది.

one person suspect death at suraram in hyderabad
అతిగా మద్యం సేవించి... ఓవ్యక్తి మృతి

By

Published : Oct 18, 2020, 5:02 PM IST

మేడ్చల్ జిల్లా ఐడీపీఎల్ సుమిత్రా నగర్​కు చెందిన కరుణాకర్​ ఇటీవలే తన భార్య మరణించడం వల్ల మద్యానికి బానిసయ్యాడు. సురారం రాజీవ్ గృహకల్పకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న కరుణాకర్ తరచు ఆమె దగ్గరికి వెళుతుండే వాడు. శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించి సూరారంలోని ఆ మహిళ వద్దకు వెళ్లాడు.

ఉదయం అతన్ని నిద్రలేపగా ఉలుకూ పలుకూ లేదు. మృతి చెందాడని గ్రహించి ఆమె కరుణాకర్​ మృతదేహాన్ని మరో వ్యక్తి సాయంతో ఇంటి ముందు ఉన్న రోడ్డుపై పడేసింది. దీనితో మొదట హత్యగా భావించిన పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు జరపగా మహిళ అసలు విషయం పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:పాతబస్తీలో అర్ధరాత్రి యువతి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details