తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓఆర్​ఆర్​ ప్రమాదంలో వ్యక్తి మృతి.. కారులో డ్రగ్స్! - orr car accident update

మత్తు పదార్థాలు సేవించి కారు నడపడమే ఈ రోజు ఉదయం హైదరాబాద్​ బాహ్య వలయ రహదారిపై జరిగిన ప్రమాదానికి కారణమని శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో డ్రగ్స్‌ దొరకటంతో ఆ దిశగా వైద్య పరీక్షలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ ఒక వ్యక్తి మరణించాడు.

one person died in orr car accident at hyderabad
ఉదయం జరిగిన ఓఆర్​ఆర్​ కారు ప్రమాదానికి కారణం అదేనా..?

By

Published : Jan 30, 2021, 4:20 PM IST

ఈ రోజు ఉదయం హైదరాబాద్​ బాహ్య వలయ రహదారిపై కారు డివైడర్​ని గుద్దిన ఘటనలో సయ్యద్​ ఫైజల్​ అనే వ్యక్తి చనిపోయినట్లు శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు పేర్కొన్నారు. మత్తు పదార్థాలు సేవించి, కారు అతివేగంగా నటపడమే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.

ఈ ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న మహ్మద్​ షాబాజ్​ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగితా నలుగురికి స్వల్ప గాయాలైనట్టు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో డ్రగ్స్‌ దొరకటంతో యువకులకు ఆ దిశగా వైద్య పరీక్షలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అనుమానం: భార్య గొంతు కోసి పరారైన భర్త

ABOUT THE AUTHOR

...view details