బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నారాయణపేట జిల్లా కేంద్ర సమీపంలో జరిగింది. జిల్లాలోని నారాయణపేట మండలం పెరపల్ల గ్రామానికి చెందిన భీమపోల నర్సింహులు (57) దామరగిద్ద గ్రామంలో బంధువులు సోమవారం నాడు నిర్వహించిన కందూరు(ఉత్సవం)కు మరో ఇద్దరితో కలిసి హాజరయ్యాడు. కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ నిలిచి ఉన్న లారీని ఢీ కొట్టారు.
జిల్లా కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - తెలంగాణ ప్రమాదవార్తలు
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
జిల్లా కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
సంఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న క్షతగాత్రులను స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రిలో చేర్చగా అప్పటికే నర్సిములు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన హనుమంతు హనుమంతు అనే వ్యక్తిని మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తి స్థానిక ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం