ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జీజీహెచ్ కొవిడ్ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు ఆసుపత్రిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలో మూలపేట ప్రాంతానికి చెందిన కరోనా బాధితురాలు పరమేశ్వరమ్మ... తన చీరతో అగ్నిప్రమాదాన్ని నిరోధించే ఇనుప కమ్మీకి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ ఘటన జరగటం వల్ల చర్చానీయాంశమైంది.
నెల్లూరు జీజీహెచ్లో కరోనా బాధితురాలు ఆత్మహత్య - nellore ggh latest news
ఏపీలోని నెల్లూరు జీజీహెచ్ కొవిడ్ ఆసుపత్రిలో విషాదకర ఘటన జరిగింది. కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు.. కట్టుకున్న చీరతోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
నెల్లూరు జీజీహెచ్లో వృద్ధురాలు ఆత్మహత్య
వైరస్ సోకినప్పటి నుంచి ఆగకుండా వాంతులు అవుతుండటం వల్ల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఘటనపై వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:పనుల కనికట్టు..అవినీతి గుట్టురట్టు