తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఉరి వేసుకుని నవదంపతుల ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న నవజంట దాంపత్య జీవితం ప్రారంభంలోనే తనువు చాలించారు. ఏ కష్టమొచ్చిందో తెలియదు పెళ్లైన ఆరునెలల్లోనే  ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్​ ఉప్పల్​లో జరిగిన ఈఘటన స్థానికంగా విషాదం నింపింది.

new-couple-suicide-at-uppal

By

Published : Apr 19, 2019, 2:52 PM IST

హైదరాబాద్​ ఉప్పల్​ ప్రశాంతి నగర్​లో విషాదం జరిగింది. నవ దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉప్పల్​ ఇందిరానగర్​కు చెందిన అనితను కందుకూరి రమేశ్​నాయుడు అనే వ్యక్తి ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసున్నాడు. రమేశ్​ స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అనిత టైలరింగ్​ పని చేస్తోంది.

అసలేమైంది...?

గురువారం అర్ధరాత్రి సమయంలో తామిద్దరూ చనిపోతున్నట్లు స్నేహితుని చరవాణికి సందేశం పంపారు. అనంతరం భార్యభర్తలిద్దరూ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

నవదంపతుల ఆత్మహత్య

ఇదీ చదవండి: ఇంటర్​లో ఫెయిల్... విద్యార్థిని సూసైడ్..

ABOUT THE AUTHOR

...view details