తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం... చంపేసి కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితుడు - Boy died in Shamirpet

షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం... బాలుడి మృతి
షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం... బాలుడి మృతి

By

Published : Oct 26, 2020, 12:31 PM IST

Updated : Oct 26, 2020, 4:46 PM IST

12:29 October 26

షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం... చంపేసి కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితుడు

షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం... బాలుడి మృతి

సరదా కోసం తీసుకుంటున్న షేర్​చాట్​ వీడియో ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. ఆడుకుంటానని బయటికి వెళ్లిన ఐదేళ్ల అభియాన్‌ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కలా అంతా వెతికారు. లాభం లేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించారు. అభియాన్‌ను చంపేసిన వ్యక్తి... ఘటనను కిడ్నాప్‌గా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. కుమారుడి మరణావార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

విషాదం...

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో అదృశ్యమైన ఐదేళ్ల బాలుడు అభియాన్‌ ఘటన విషాదాంతమైంది. ఈనెల 15న ఆడుకోవడానికి బయటికి వెళ్లి తిరిగిరాకపోవడం వల్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు... శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డు పక్కన అభియాన్‌ మృతదేహాన్ని గుర్తించారు. బాలుడు ఉంటున్న ఇంట్లోనే అద్దెకు ఉంటున్న బిహార్‌ వాసి సుదర్శన్‌ శర్మ హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు.  

వీడియో తీసే క్రమంలో...

బిహార్‌కు చెందిన సుదర్శన్‌ శర్మ... నెలరోజులుగా అభియాన్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈనెల 15న షేర్‌చాట్‌ వీడియోలు చిత్రీకరించేందుకు బాలుడిని పిలిచాడు. వీడియో తీసే క్రమంలో అభియాన్ భవనంపై నుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. అభియాన్‌ తల్లిదండ్రులు కొడతారని భయపడ్డ సుదర్శన్‌... బాలుడ్ని చంపేసి సంచిలో పెట్టుకుని బాహ్యవలయ రహదారి వద్ద పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.  

ఫోన్​ కాల్ ఆధారంగా...

తర్వాత ఇంటి యజమానికి ఫోన్‌ చేసి రూ. 15 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తామని బెదిరించాడు.  ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. సుదర్శన్‌ ఇచ్చిన సమాచారంతో ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లిన పోలీసులకు బాలుడి అస్థికలు, దుస్తులు కనిపించాయి. ఘటనాస్థలిలో అభియాన్‌ అస్థికలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని తల్లిదండ్రులకు అప్పగించారు. వాటిలో కొన్ని ఎముకలను డీఎన్​ఏ పరీక్షకు పంపినట్లు తెలిపారు.  

ఇవీచూడండి:జియాగూడలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రులు

Last Updated : Oct 26, 2020, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details