తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవలితో హత్యాయత్నం - తెలంగాణ తాజా వార్తలు

ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై అర్ధారాత్రి సమయంలో ఓ దుండగుడు కొడవలితో దాడి చేశాడు. కేకలు వేయడం వల్ల చుట్టుపక్కల వారు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన భైంసా మండలం మహగాంవ్​లో జరిగింది.

నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవలితో హత్యాయత్నం
నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవలితో హత్యాయత్నం

By

Published : Oct 4, 2020, 11:16 AM IST

నిర్మల్ జిల్లా భైంసా మండలం మహగాంవ్​లో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. గ్రామానికి చెందిన ర్యపని నర్సింహులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడు కొడవలితో దాడి చేశాడు. నర్సింహులు కేకలు వేయడం వల్ల అప్రమత్తమైన చుట్టుపక్కల వారు పారిపోతున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన నర్సింహులుని చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలిచారు.

గొడవ అదేనా..

కొన్నిరోజుల క్రితం మహారాష్ట్రలోని బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు తన డబ్బులు పోయాయని నర్సింహులు తెలిపాడు. ఆ డబ్బు తన బంధువు తీసుకున్నాడేమోనని అడిగానని.. ఆ విషయం మనసులో పెట్టుకుని ఇంటికొచ్చి తనపై హత్యాయత్నం చేశాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details