తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్​ హత్యకు పథకం - murder plan in illandhu

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్​ను చంపించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలో రెక్కి నిర్వహిస్తూ... వ్యూహరచన చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికంతటికీ సూత్రధారి ఆమె భర్తే కావటం గమనార్హం.

mudre plan reveled and police arrested 2 accused in illandhu
mudre plan reveled and police arrested 2 accused in illandhu

By

Published : Oct 20, 2020, 5:46 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్​గా పనిచేస్తున్న వేముల రచితను హతమార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హతమార్చేందుకు భర్త అశోక్ పన్నాగం పన్నినట్టు పోలీసులు వెల్లడించారు.

భార్యను చంపించేందుకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన భూక్య వీరబాబు, కొత్తూరు ప్రసాద్​కు అశోక్​ రూ.3 లక్షల సుఫారీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో నిందితులు ఇల్లందు కోర్టులో రెక్కీ నిర్వహించి వ్యూహరచన చేస్తున్నారు. కోర్టు ఆవరణలో అనుమానాస్పదంగా కనిపించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఇద్దరు నిందితుల నుంచి రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: అసలేం జరిగిందో.. మహేష్​ హత్యకేసులో వీడని చిక్కుముడి!

ABOUT THE AUTHOR

...view details