యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో తప్పిపోయి తిరుగుతున్న బాలుడిని గ్రామస్థులు గుర్తించారు. బాలుడి వివరాలు తెలుసుకునేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు బాలుడిని రాయగిరిలోని సహృదయ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. బాలుడి పేరు శివ అని తెలుసుకున్న.. పోలీసులు దర్యాప్తు చేపట్టి శివ తల్లిదండ్రులది.. నల్గొండ జిల్లా కనగల్గా గుర్తించారు. గత రెండు రోజులుగా సహృదయ అనాథాశ్రమంలో ఉన్న బాలుడిని.. భువనగిరి బాలల పరిరక్షణ విభాగానికి అప్పగించారు. అనంతరం నల్గొండ చిల్డ్రెన్స్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచారు.
తల్లిదండ్రుల చెంతకు.. తప్పిపోయిన బాలుడు - తల్లిదండ్రులను చేరుకున్న బాలుడు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో తప్పిపోయి తిరుగుతున్న ఓ బాలుడిని గ్రామస్థులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. గత రెండురోజుల క్రితం తప్పిపోయిన బాలుడికి పోలీసులు రాయగిరిలోని సహృదయ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. బాలుడి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.
తల్లిదండ్రుల చెంతకు చేరిన.. తప్పిపోయిన బాలుడు
నల్గొండ జిల్లా కనగల్ గ్రామానికి చెందిన శ్రీను, ముత్యాలమ్మలు బాలుడి తల్లిదండ్రులుగా గుర్తించి అతడిని వారికి అప్పగించారు. సెప్టెంబర్ 30న తప్పిపోయి.. భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో తిరుగుతుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్టు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. అనాజిపురం గ్రామానికి చేరుకున్న ఎస్సై బాలుడిని సహృదయ అశ్రమానికి తరలించారు. శివ గతంలో కూడా ఇలాగే.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేశాడని అధికారులు, పోలీసులు తెలిపారు.