తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆవుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోరక్షక్​ దళ్​ సభ్యులు - హయత్​నగర్​లో ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకున్న వార్తలు

హయత్​నగర్​ ఠాణా పరిధిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న ఓ వాహనాన్ని తెలంగాణ గో రక్షక్ దళ్‌, యుగ తులసి ఫౌండేషన్ సభ్యులు అడ్డుకున్నారు. 13 ఆవులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించారు.

Members of the Gorakhshak Dal prevented the smuggling of cows
ఆవుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోరక్షక్​ దళ్​ సభ్యులు

By

Published : Jul 17, 2020, 2:37 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనాన్ని తెలంగాణ గో రక్షక్​ దళ్, యుగ తులసి ఫౌండేషన్​ సభ్యులు అడ్డుకున్నారు. 13 గోవులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ఆలేటి గోశాలకు తరలించారు.

ఫౌండేషన్​ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆవులను తరలిస్తున్న వాహనంతో పాటు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆవుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోరక్షక్​ దళ్​ సభ్యులు

ఇదీచూడండి: ఆసుపత్రి నుంచి రిమాండ్​ ఖైదీ పరార్​.. గాలింపు చర్యలు ముమ్మరం

ABOUT THE AUTHOR

...view details