సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తిరుమల రియల్ ఎస్టేట్ వెంచర్లో మెదక్ ఎన్ఫోర్స్మెంట్ టీం దాడి చేసింది. ఆ దాడిలో ఎండు గంజాయి, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో ఒక వాహనంలో రెండు ప్లాస్టిక్ బాటిళ్లు, 5 గ్రాముల హశిష్ ఆయిల్ అనే మత్తు మందు, 10 గ్రాముల గంజాయి నూనె లభ్యమైంది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు.
రియల్ ఎస్టేట్ వెంచర్‌పై దాడి.. గంజాయి, మత్తు పదార్థాలు స్వాధీనం
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తిరుమల రియల్ ఎస్టేట్ వెంచర్లో మెదక్ ఎన్ఫోర్స్మెంట్ టీం చేసిన దాడిలో ఎండు గంజాయి, మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మొత్తం విలువ సుమారు రూ. 3,70,000 ఉంటుందని తెలిపారు.
రియల్ ఎస్టేట్ వెంచర్‌పై దాడి.. గంజాయి, మత్తు పదార్థాలు స్వాధీనం
విచారణలో రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో ఓ ఇంట్లో దాడి చేయగా 72 ప్లాస్టిక్ హశిష్ ఆయిల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారిణి గాయత్రి తెలిపారు. అంతే కాకుండా 11.5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 3,70,000 ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చదవండి:'ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడం కోసమే 2కే రన్'