అత్తింటి వారి వేధింపులు తాళలేక స్వప్న అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కళావతి నగర్లో జరిగింది. భర్త, అత్త కలిసి రోజూ తమ కూతురిని హింసించేవారని.. ఆ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
వేధింపులు తాళలేక వివాహిత బలవన్మరణం - హైదరాబాద్ నేర వార్తలు
ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అత్తింటివారి వేధింపుల కారణంగానే తమ కూతురు చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
బాచుపల్లి ప్రాంతంలో నివాసం ఉండే స్వప్న(19)కు జీడిమెట్లలోని కళావతినగర్‌కు చెందిన వెంకటేష్‌తో 8 నెలల క్రితం వివాహం జరిగింది. 3 నెలల పాటు సాఫిగానే సాగిన వారి వైవాహిక బంధంలో మద్యం చిచ్చుపెట్టింది. వెంకటేష్ పని చేయకుండా ప్రతిరోజు మద్యం తాగి వచ్చి స్వప్నను హింసించేవాడు. దీనికి తోడు అత్త, ఆడపడుచు వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవడంతో జీవితం మీద విరక్తి చెందిన స్వప్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు సమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:మృతదేహంలో భర్త ఇంటిముందు ఆందోళన... ఉద్రిక్తత