ప్రేమంటూ తిరిగాడు.. కాదన్నందుకు కక్ష పెంచుకున్నాడు. అదును చూసి చంపేశాడు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని క్రీస్తు రాజపురానికి చెందిన దివ్య తేజస్విని అనే యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. స్వామి అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంట తిరిగాడు. ఆమె అంగీకరించకపోయేసరికి... కత్తితో దాడి చేశాడు. మెడపై పొడిచిన స్వామి తర్వాత తనను తాను గాయపరుచుకున్నాడు.
మార్గమధ్యలోనే..
స్వామి దాడిలో తీవ్రంగా గాయపడిన దివ్యను స్థానిక ప్రభుత్వాసుపత్రికి మొదట తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడం వల్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. తరలిస్తుండగానే మార్గ మధ్యలో దివ్య కన్నుమూసింది.