పాఠశాలలో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై లైంగికి దాడికి యత్నించిన సూర్యాపేటలోని గొల్లబజారుకు చెందిన షేక్ దాదాసాహెబ్‌కు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. పోక్సో కోర్టు న్యాయమూర్తి భవాని తీర్పు చెప్పారు. రూ.10 వేల జరిమానా విధించారు.
అడ్డగూడూరులోని సాంఘిక సంక్షేమ పాఠశాల భవనానికి పెయింటింగ్ పనుల నిమిత్తం వచ్చిన దాదాసాహెబ్.. పాఠశాలలో దుస్తులు మార్చుకోవడానికి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక అతని నుంచి తప్పించుకొని ప్రిన్సిపల్‌కు తెలపడంతో అతనిపై అడ్డగూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.