రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పరిగి మండలం మాదరం గ్రామానికి చెందిన సత్తయ్య అనే వ్యక్తి... కూలి పని చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి తలపై కడితో బాది హత్య చేసినట్టు తెలుస్తోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సీఐ బాలకృష్ణ ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తలపై బాది వ్యక్తి దారుణ హత్య - మల్కాపూర్‌లో మాదరం వ్యక్తి హత్య
కడితో తలపై బాది ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన... రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ శివారులో చోటుచేసుకుంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తలపై బాది వ్యక్తి దారుణ హత్య