ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా గడుపుతున్న వేళ ఓ యువకుడి పట్ల విధి కత్తి కట్టింది. తాను రోజూ చేసే పనే మృత్యువు రూపంలో ఎదురైంది. ఫ్లెక్సీ బోర్డింగ్ అమర్చుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటనమేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్లోని మాదన్నపేట్లో నివాసం ఉండే ప్రవీణ్, వినీతలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక సంతానం. ఫ్లెక్సీ బోర్డింగ్ అమర్చే పనిచేసుకుంటూ ప్రవీణ్ జీవనం సాగిస్తున్నాడు. జీడిమెట్ల పరిధిలోని శాపూర్ మార్కెట్లో ఉన్న ఓ దుకాణంలో ఆదివారం పని చేస్తుండగా విద్యుదాఘాతంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు.