తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బైకును ఢీకొన్న టిప్పర్.. వ్యక్తి మృతి - man died in road accident in bourampeta

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా దుండిగల్​ పరిధిలోని బౌరంపేటలో టిప్పర్​ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

man died in road accident in bourampeta at medchal district
బైకును ఢీకొన్న టిప్పర్.. వ్యక్తి మృతి

By

Published : Jun 18, 2020, 1:45 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మల్లంపేట గ్రామానికి చెందిన ప్రశాంత్​.. రోజూలానే పాశమైలారంలో ఉండే గ్లాండ్​ ఫార్మా పరిశ్రమకు ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్నాడు. దుండిగల్​ పరిధిలోని బౌరంపేట సమీపంలోకి రాగానే అతనికి మృత్యువు రూపంలో టిప్పర్​ ఎదురుగా వచ్చి ప్రశాంత్​ను ఢీకొంది.

తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details