తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య - మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య

రోడ్డుపై నడుస్తున్న ఓ మహిళను ఢీకొట్టిన ఘటన ఇంట్లో వాళ్లకి తెలుస్తుందని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళా పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ అతను చనిపోవడం అందర్నీ కలచివేసింది.

Hyderabad latest news
Hyderabad latest news

By

Published : May 27, 2020, 12:39 AM IST

గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్​.పి రోడ్​లో ఈ నెల 23న సాయంత్రం ఐదు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోండా మార్కెట్​లోని జ్యూయలరీ షాప్​లో పనిచేస్తున్న మహేశ్​(25) మల్లేపల్లిలోని సీతారాంబాగ్​లోని తన ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆర్.పి రోడ్ వద్ద రోడ్డు దాటుతున్న హైదర్ నగర్​లో నివాసముండే సుభాషిని అనే మహిళను ఢీ కొట్టాడు. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. స్థానికంగా ఉన్న వారు 100 నంబర్​కు డయల్ చేయడం వల్ల గాంధీ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఆమెను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన మహేశ్​ను... పోలీసులు స్టేషన్ పిలిపించి అతని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత అతని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. అయితే అతను ఇంటికి వెళ్లలేదు.

రోడ్డు ప్రమాదం జరిగిన స్థలంలో అతని ఫోన్ పడిపోయింది. రాత్రి పదిన్నర గంటలకు అతని ఫోన్​కి మహేశ్​ తల్లిదండ్రులు ఫోన్ చేయగా మీ మహేశ్​కు యాక్సిడెంట్ అయింది గాంధీ ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పి ఫోన్​ పెట్టేశారు. మరుసటి రోజు కూడా కొడుకు ఇంటికి రాకపోవడం వల్ల మహేశ్​ తండ్రి విశ్వంబర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నెల 24న మహేశ్​ అదృశ్యమైనట్లు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటినుంచి పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.

పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళన....

బుధవారం ఉదయం ట్యాంక్ బండ్​లో గుర్తు తెలియని మృతదేహం లభించింది. రాంగోపాల్ పేట్ పోలీస్​లు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరించగా ఈనెల 23న రోడ్డు ప్రమాదానికి కారకుడైన మహేశ్​ అని గుర్తించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు గాంధీ నగర్ పోలీస్ స్టేషన్​కు వచ్చి పోలీసుల వేధింపుల వల్లే తమ సోదరుడు ట్యాంక్ బండ్​లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. వెంటనే తమ సోదరుడు మహేశ్​ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్డు ప్రమాదం జరిగిన రోజున మహేశ్​ను పోలీస్ స్టేషన్​కు పిలిపించి వివరాలు సేకరించి ఇంటికి వెళ్లమని చెప్పినట్లు గాంధీనగర్​ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు అడిగితే ఫోన్​లో ఉన్నాయని... ఆ ఫోన్ తన దగ్గర లేదని చెప్పాడని పేర్కొన్నారు. మృతుడు పోలీస్ స్టేషన్ నుంచి ట్యాంక్​బండ్​ వరకు నడిచి వెళ్లిన సీసీ ఫుటేజ్​ వీడియోను కూడా వారి కుటుంబ సభ్యులకు చూపించినట్లు సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details