రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్య మానేరు ప్రాజెక్టు వంతెనపై నుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. కొదురుపాక వద్ద మధ్య మానేరు వంతెనపై నుంచి దూకగా అక్కడే ఉన్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బోయినపల్లి ఎస్సై శ్రీనివాస్.. స్థానిక మత్స్యకారుల సాయంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని రక్షించారు.
వంతెనపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు - boinapalli news
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్య మానేరు ప్రాజెక్టు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. స్థానిక మత్సకారుల సాయంతో.. సదరు వ్యక్తిని కాపాడి స్వగ్రామానికి తరలించారు.
man attempted to suicide at mid manir dam at boinapalli
తెప్పల సాాయంతో జలాశయం నుంచి సదరు వ్యక్తిని పైకి తీసుకొచ్చారు. బాధితుడు వేములవాడ మండలం అగ్రహారానికి చెందిన కల్లెం మహేశ్‌గా పోలీసులు గుర్తించారు. కౌన్సెలింగ్ నిర్వహించి స్వగ్రామానికి తరలించారు.