నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కిష్టరాయునిపల్లిలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు. యువతి తలపై రాయితో కొట్టి... తీవ్రంగా గాయపరిచాడు. తనని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటోందని ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం.
పెళ్లికి నిరాకరించిందని యువతిపై యువకుడు దాడి
పెళ్లికి నిరాకరించిందని యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కిష్టరాయునిపల్లిలో చోటుచేసుకుంది. దాడి అనంతరం యువకుడు ట్యాంకు మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
పెళ్లికి నిరాకరించిందని యువతిపై యువకుడు దాడి
యువతిపై దాడి చేసిన అనంతరం మంచినీటి ట్యాంకు మీద నుంచి దూకి యువకుడు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. యువకుడిని మర్రిగూడ ఆస్పత్రికి తరలించారు.