తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కట్నం వేధింపుల కేసులో భర్త, అత్తకు ఏడేళ్ల జైలు శిక్ష

పెళ్లైన నాలుగు నెలల నుంచి అదనపు కట్న కోసం... ఆత్మహత్య చేసుకునేంతగా వేధించిన భర్త, అత్తకు హైదరాబాద్​లోని మల్కాజిగిరి న్యాయస్థానం శిక్ష విధించింది. సాక్ష్యాలన్ని పరిశీలించి నిందితులిద్దరికీ... ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ... తీర్పు వెలువరించింది.

కట్నం వేధింపుల కేసులో భర్త, అత్తకు ఏడేళ్ల ఖైదు
కట్నం వేధింపుల కేసులో భర్త, అత్తకు ఏడేళ్ల ఖైదు

By

Published : Dec 8, 2020, 9:52 PM IST

హైదరాబాద్​లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో అదనపు కట్నం కోసం వేధించి భార్య ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్తకు ఏడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ మాల్కాజిగిరి కోర్టు తీర్పు వెలువరించింది. మల్కాజిగిరికి చెందిన శశికిరణ్​తో ఏపీలోని కృష్ణా జిల్లా కొండూరుకు చెందిన లీలావతికి 2015 అక్టోబర్​లో వివాహం జరిగింది. లీలావతి తండ్రి కృష్ణారెడ్డి 10లక్షల నగదు, 10 తులాల బంగారం, 3 ఎకరాల మామిడి తోట కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాడు.

నాలుగు నెలలకే...

వివాహమైన 4 నెలల నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులకు గురిచేశారు. మరో 5 లక్షలతో పాటు, 10 తులాల బంగారం డిమాండ్ చేశారు. ఇందు కోసం తీవ్ర వేధింపులకు గురిచేయటం వల్ల తట్టుకోలేక లీలావతి... 2016 జూన్​లో బలవంతంగా తనువు చాలించింది. చేతులు బ్లేడుతో కోసుకుని... ఉరి వేసుకుని అత్మహత్య చేసుకుంది.

కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన మల్కాజిగిరి పోలీసులు... విస్తృతంగా దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించారు. సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన మల్కాజిగిరి కోర్టు... నిందితులిద్దరికి 7 ఏళ్ళ జైలు శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధించింది.

ఇదీ చూడండి: కాటన్​ మిల్లులో అగ్నిప్రమాదం... భారీగా ఆస్తినష్టం

ABOUT THE AUTHOR

...view details