కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
గ్రామానికి చెందిన మడావి సూర్యారావు కుమార్తె విజయలక్ష్మి తరచూ... తన అక్క ఇంటికి వెళ్లేది. అక్క ఊరైనా... జైనూర్ మండలంలోని రాసి మెట్ట గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం కుమారుడు భీంరావుతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. వీరిరువురి మధ్యలో ప్రేమాయణం సంవత్సరం నుంచి కొనసాగుతోంది.
ఈ క్రమంలో పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకోరేమోనని.. మనస్థాపం చెంది ఒకరిని ఒకరు విడిచి ఉండలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి తనువులు చాలించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఘటనా స్థలంలోకి వెళ్లి పరిశీలించారు. అప్పటికే ప్రేమికులు ఇద్దరు పురుగుల మందు సేవించారు. అక్కడికక్కడే విజయలక్ష్మి మృతి చెందింది. భీంరావు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?