ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. పెద్దలను ఒప్పించి ఒక్కటవ్వాలనుకున్నారు. ఎన్నో ప్రేమ కథల్లాగే వీరికి అవాంతరాలు ఎదురయ్యాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చావులో ఒక్కటయ్యారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోలేక ఉసురు తీసుకున్నారు.
కులాలు వేరని పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు.. ప్రేమజంట ఆత్మహత్య - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
09:30 December 11
కులాలు వేరని పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు... ప్రేమజంట ఆత్మహత్య
ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమ జంట కథ విషాదాంతం అయింది. కలిసి బతకలేని పరిస్థితుల్లో చావే శరణ్యమనుకున్నారు. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరిచలేదని యువతీయువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువులో జరిగింది.
కులాలే కారణమా?
చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్-కేశబోయిన మహేశ్వరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. మనస్తాపానికి గురైన ప్రేమజంట మునగాల మండలం మొద్దుల చెరువు శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టారు.
గురువారం సాయంత్రం ఇంట్లో చెప్పకుండా బయటికి వచ్చిన వారు... రాత్రి వేళ ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని మునగాల ఎస్సై కారింగుల సత్యనారాయణ గౌడ్ తెలిపారు. యువతి కేషబోయిన మహేశ్వరి మైనర్ అని సమాచారం. స్థానికులు ప్రేమజంటను చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యులుకు విషయం తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్సై కారింగుల సత్యనారాయణ తెలిపారు.